హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ , హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్వీఎస్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే ఏడాదిపాటు రీఅపాయింట్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. 2026 ఏప్రిల్ ఒకటి వరకు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నది.