జోగులాంబ గద్వాల : తెలంగాణలో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు . గురువారం జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డను అందించడానికి అవకాశం ఉంటుందన్నారు. మనం తీసుకునే ఆహార నియమాల వల్లే జీవన విధానంలో మార్పులు వస్తుంటాయని చెప్పారు. దేశానికి ఆదర్శం ఈ పథకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, కలెక్టర్ వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.