హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పేదరికం కారణంగా వైద్యవిద్యకు దూ రం అవుతానేమోననే ఆందోళనలో ఉన్న విద్యార్థినికి ఓ ఎన్నారై ఆర్థిక చేయూతనిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీ దుగా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందించా రు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వీపనగం డ్ల మండలంలోని కల్వరాలకు చెందిన బోరెల్లి నర్సింహ, శ్యామల పెద్దకుమార్తె గౌరికి మెదక్ జిల్లా మహేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది.
పేదరికం కారణంగా గౌరిని క ళాశాలలో చేర్పించటం ఆ తల్లిదండ్రులకు భా రంగా మారింది. విషయం తెలుసుకున్న ఎన్నా రై దూడల వెంకట్‌గౌడ్ ఆ విద్యార్థినికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. యాదాద్రి -భువనగిరి జిల్లాకు చెందిన వెంకట్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. పేద విద్యార్థికి సాయం అందిస్తే ఆ కుటుంబం నిలబడటమే కాకుండా మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావించారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌కు చెప్పారు.
తన తండ్రి రవీందర్ ద్వారా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందిస్తానని, విద్యార్థినికి అందించాలని కేటీఆర్‌ను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో విద్యార్థి, ఆమె తల్లిదండ్రులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సర ట్యూషన్ ఫీజును చెక్‌రూపంలో కేటీఆర్ అందజేశారు. కేటీఆర్ ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ తనకు స్ఫూర్తి అని వెంకట్ పేర్కొన్నారు.
పట్టుదలతో ఎదగాలి
పట్టుదలతో ఎదిగి పది మందికి ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ ఈ సందర్భంగా విద్యార్థి గౌరికి సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ముందుకొచ్చిన దాత ఉద్దేశాన్ని గమనంలోకి తీసుకొని ఎదగాలన్నారు. ఈ సందర్భంగా గౌరి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పబోతుంటే వారించారు. కష్టపడి చదివి ఇంటికి వెలుగు తీసుకురావటమే కాకుండా సాయం అందించేందుకు ముందుకు వచ్చిన వారికి స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్నారై వెంకట్, ఆయన తండ్రి రవీందర్‌కు విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.