హైదరాబాద్ : అమెరికా, ఖతార్ పర్యటనల అనంతరం సోమవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. మహేష్ బిగాల కేటీఆర్‌తో వివిధ విషయాలపై చర్చించారు. ఈ పర్యటనలో తెలంగాణ వాళ్ళే కాకుండా మిగతా రాష్ట్రాల ఎన్నారైలు మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై వివిధ దేశాల ఎన్నారైల అభిప్రాయాయాలను వారి సూచనలను కేటీఆర్‌కు వివరించారు. కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వివిధ దేశాల్లో వున్నా అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో వివరించి మద్దతు కూడబెడుతామని మహేష్ బిగాల అన్నారు. మహేష్ బిగాల చేస్తున్న వివిధ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.