హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నాం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తాం’.. అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత వివిధ దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎన్నారైగా పార్టీకి సేవలందించిన తనకు కేసీఆర్.. రాష్ట్ర కార్పొరేషన్ పదవి ఇచ్చి గౌరవించారని అనిల్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ పిలుపునిచ్చే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నారు.