హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడతామని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఆనాడు తెలంగాణ సమా జం యావత్తు కేసీఆర్ వెంట నిలవడంతో కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి దీక్షా దివస్ స్ఫూర్తి, అమరుల త్యాగాలు, పోరాటాలు ప్రపంచదేశాల్లో తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఆమెతో మాట్లాడినట్టు వెల్లడించారు.
పెద్దపల్లి, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు 11నెలలుగా ఎదురు చూస్తున్న స్ట్రక్చర్ మీటింగ్కు ఎట్టకేలకు తేదీ ఖరారైంది. ఈ నెల 28న కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో సమావేశం జరుగనున్నది. నిరుడు డిసెంబర్ 28న ఎన్నిక లు జరగగా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీయూసీ గెలుపొందాయి. మూడు నెలలకోసారి సమావేశాలు జరగాల్సి ఉన్నది. 11నెలలైనా కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్, జేసీసీ సమావేశాల ఊసేలేదు. సమావేశంలో సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు.