హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీలో 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (టీఎస్టీ), 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు www.tgprb.in వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. టీఎస్టీ పోస్టుకు ఈ ఏడాది జూలై 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఎంఎస్టీ పోస్టుకు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపింది.