హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాటగిరీ -6 (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో మొత్తం 118 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వివరాల కోసం www.tgprb.in వెబ్‌సైట్‌ను చూడాలని టీజీపీఆర్బీ చైర్మన్ ఏడీజీ వీవీ శ్రీనివాసరావు సూచించారు.