హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): జనగణన-2027కు సం బంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. సీఎస్ కే రామకృష్ణారావు జీవో 142ను శనివారం జారీచేశారు.
తెలంగాణ ప్రభుత్వం జనగణన-2027కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రకటనను రాష్ట్ర గెజిట్లో ప్రచురించనున్నది. భారత జనగణన చట్టం 1948 సెక్షన్ 3 కింద 2027 మార్చి 1 అర్ధరాత్రి 12:00 గంటలకు దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.