హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్‌లో పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. హైకోర్టు పరిధిలో 212, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్ 1,277, టెక్నికల్ 184 ఇలా మొత్తం 1,673 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోర్టు మాస్టర్/పర్సనల్ సెక్రటరీస్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, సిస్టమ్ అనలిస్ట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. వయోపరిమితి 18-34 ఏండ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ జనవరి 31. వివరాలకు వెబ్సైట్ https://tshc.gov.inను చూడవచ్చు.
సీయూఈటీ పీజీ దరఖాస్తు ఫీజు పెంపు ; మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్(సీయూఈటీ) పీజీ షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అన్ని క్యాటగిరీల దరఖాస్తు ఫీజులను రూ. 200 పెంచింది. ఇది వరకు రెండు జనరల్ పేపర్లకు ఫీజు రూ.1200 ఉండగా, దీనిని రూ.1400 కు పెంచింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల ఫీజు రూ. వెయ్యి ఉండగా రూ.1200కు, ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్ అభ్యర్థుల ఫీజు రూ.900 ఉండగా, రూ.1100కు, దివ్యాంగ అభ్యర్థుల ఫీజు రూ.900ఉంటే రూ.వెయ్యికి పెంచింది. ఇది వరకు పరీక్షా సమయం 105 నిమిషాలుండగా, ఇప్పుడు 90 నిమిషాలకు కుదించింది.