హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖలోని ఇంజినీరింగ్ విభాగం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. 7,449.50 కిలోమీటర్ల మేర 17 ప్యాకేజీలుగా 2,162 రోడ్లను నిర్మించేందుకు రూ.6,294.81 వేల కోట్ల వ్యయం అవుతుందని తెలిపింది. 30 నెలల వ్యవధిలో ఈ రోడ్లను నిర్మించాలని, ఆ తర్వాత 15 ఏండ్లపాటు వాటి నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నది.