APP Posts | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులను త్వర లో భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను వారంలోగా జారీచేస్తామని మంగళవారం హైకోర్టుకు తెలియజేసింది.
ఏపీపీ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ జూన్‌లోనే అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.