హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 60 ఉద్యోగాలకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు.
సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 3, బయాలజీ/సెరోలజీ 3, కంప్యూటర్స్ 2 పోస్టులు.. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్/జనరల్ 5, కెమికల్ 10, బయాలజీ/సెరోలజీ 10, కంప్యూటర్స్ 7 పోస్టులు ఉన్నాయి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 6, బయాలజీ/సెరోలజీ 4, కంప్యూటర్స్ 5, ల్యాబోరేటరీ అటెండెంట్ ఒక పోస్టు ఖాళీ ఉన్నట్టు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.tgprb.inలో ఈనెల 27 నుంచి డిసెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్(ఎన్ఎంఎంఎస్) పరీక్షను ఈ నెల 23న నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. హాల్టికెట్లను శనివారం http//bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.