హైదరాబాద్ జూన్ 21 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రూపొందించిన చట్టం అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమ రవాణాకు గురైన మహిళలు, బాలలను రక్షించిన తర్వాత రక్షణ గృహాలకు తరలించడం పై మార్గదర్శకాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమ శాఖలతోపాటు రాష్ట్ర డీజీపీని, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను జస్టిస్ నంద ఆదేశించారు.