హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు సంబంధించి సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన విచారణ జరిపారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. నిందితులు శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాసర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుకు అనుమతిచ్చారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు సందర్భంగా షరతులను సవరించాలని, ఏపీ వెళ్లేందుకు వీలుకల్పించాలని వైఎస్ భాసర్‌రెడ్డి వేసిన మరో పిటిషన్‌పై తీర్పును వాయిదా వేశారు.