డయాలసిస్ పరికరాల కొరతపై నోటీసులు
ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల కొరతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పరికరాల కొరత, విధానపరమైన లోపాల కారణంగా రోగులు కొత్త వ్యాధుల బారిన పడుతున్నారని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేరొంటూ దాఖలైన పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్,
- లేఖను పిల్‌గా విచారించిన హైకోర్టు
- కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల కొరతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. పరికరాల కొరత, విధానపరమైన లోపాల కారణంగా రోగులు కొత్త వ్యాధుల బారిన పడుతున్నారని, మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేరొంటూ దాఖలైన పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ పరికరాల కొరత ఉందని, సరైన పరీక్షలు, రక్తమార్పిడి చేయకపోవడం వల్ల కొత్త వ్యాధులు వస్తున్నాయని పేరొంటూ ఒక అడ్వకేట్ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం గా పరిగణించి విచారణ చేపట్టింది.
‘ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కో డయాలసిస్‌కు ప్రభుత్వం రూ.1950 చెల్లిస్తున్నది. ఒక పరికరంతో ఒకరికి మాత్రమే డయాలసిస్ చే యాలి. ఒక్కోసారి ముగ్గురికి కూడా వాడుతున్నారు. దీంతో మిగిలిన డయలైజర్లను ఆరోగ్యశ్రీ, ఇతర అధికారులు చేతులు కలిపి బయట అమ్మేస్తున్నారు. రక్తశుద్ధి, డయాలసిస్ యంత్రాలు పనిచేయడంలేదు’ అని న్యాయవాది లేఖలో పేరొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ ఎండీలకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

