హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడి కేసులో రెండో ముద్దాయి, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) సీఆర్పీసీ నోటీ సు ఇచ్చారు. సీఐని కలిసి రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు తెలిపారు.
ఎమ్మెల్సీల అనర్హతపై గతంలాగే వ్యవహరిస్తా: గుత్తా
నల్లగొండ ప్రతినిధి, జూలై 10 (నమస్తే తెలంగాణ): గతంలో పార్టీలు మారిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై అప్పటి శాసనమండలి చైర్మన్లు ఏ విధంగా వ్యవహరించారో.. చట్టంలో ఏముందో.. కోర్టులు ఏం తీర్పులు ఇచ్చాయో.. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై తాను కూడా ఆ పద్ధతిలోనే నిర్ణయం తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.