హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కాలేజీల్లో టాప్ కాలేజీలుగా పేరొందిన కాలేజీల్లో మొత్తం సీట్లు నిండటం లేదు. డిమాండ్ ఉన్న కీలక కాలేజీల్లో సీట్లు మిగులుతున్నాయి. నిజాం కాలేజీలో డిగ్రీ ఫస్టియర్లో ఈ సారి 205 సీట్లు భర్తీకాలేదు. సిటీ కాలేజీలో 261 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఇలా టాప్ కాలేజీల్లో సీట్లు మిగలడం గమనార్హం. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరింది. ఈ మిగులు సీట్ల భర్తీకి అధికారులు స్పాట్ అడ్మిషన్లు విడుదల చేశారు. 15,16న స్పాట్ అడ్మిషన్లు పొందవచ్చు.