హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణను మంచుదుప్పటి కప్పేయడంతో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 5.6 డిగ్రీలుగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా నమోదవుతాయని వెల్లడించింది.
పొగమంచు కారణంగా మంగళవారం శంషాబాద్ ఎ యిర్పోర్టు నుంచి వివిధ ఎయిర్పోర్టులకు వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ, చంఢీగర్, విశాఖపట్నం వెళ్లాల్సిన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు.