రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై పక్షం రోజులు దాటినా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ఆగడం లేదు. అభ్యర్థుల ఖరారు కొలిక్కి రావడంలేదు. పార్టీని నమ్ముకొని ఏండ్ల తరబడి పనిచేసిన వారిని కాదని, పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా ఇల్లందు కాంగ్రెస్ నేతలు సేవ్ కాంగ్రెస్ పేరుతో ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ఎదుట బుధవారం టికెట్ ఆశిస్తున్న పీసీసీ కార్యదర్శి చీమల వెంకటేశ్వర్లు నాయకత్వంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
– హైదరాబాద్, నమస్తే తెలంగాణ