నల్గొండ : రాజ్యాంగ చట్టాలను అనరుసరిస్తూ ధర్మబద్ధంగా పదవిని నిర్వహిస్తున్న స్పీకర్ పోచారం, తనపై బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy ) పేర్కొన్నారు. తన గురించి మాట్లాడే నైతిక హక్కు సంజయ్ కు లేదని స్పష్టం చేశారు. గవర్నర్(Governor Post) పదవి కూడా నాన్ పొలిటికల్(Non Polictical) అని, అయితే తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు పొలిటికల్ గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister) పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో అభివృద్ధి చెందారు.ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi Failure) ఘోరంగా విఫలమయ్యారని’ ఆరోపించారు.ప్రజాసమస్యలపై మాట్లాడకుండా నిత్యం ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతూ రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ పార్టీ నేతలు(Bjp Leader) చూస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడని, తెలంగాణ ను దోచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రానికి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా పార్టీ నేతలను ఏకం చేయడానికేనని, ప్రజలకు ఒరిగేది ఏమిలేదని అన్నారు. కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు తెలంగాణలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అసలుకే లేదని జోస్యం చెప్పారు.ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి కర్నాటక ఎన్నికల్లో మాట్లాడుతున్నారని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సభలో మత నినాదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కర్నాటక లో జరుగుతున్న ఎన్నికల్లో లౌకిక శక్తులు విజయం సాధించాలన్నదే తమ కోరికని ఆయన అన్నారు.