ఏటూరునాగారం, ఫిబ్రవరి 14: మే డారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొ లగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
ట్రస్ట్ బోర్డును ఆదివాసీలతో ఏర్పాటు చేయాలని అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నా.. లంబాడీలు, గిరిజనేతరులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ నెల 11న ప్రమాణ స్వీకారం ఉన్నప్పటికీ.. సేవాలాల్ జయంతి రోజున నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.