హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్తు సరఫరా చేసేందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ-టీజీఎస్పీడీసీఎల్ కార్యాచరణ ప్రణాళిక రచించింది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించింది. సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుల కోసం ప్రారంభించిన 1912 కాల్‌సెంటర్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు.
నోడల్ అధికారులు వీరే
నరసింహులు (నాగర్‌కర్నూల్), నందకుమార్ (సంగారెడ్డి), సాయిబాబా ( సిద్దిపేట), బిక్షపతి ( నల్లగొండ), ఆనంద్ (వికారాబాద్), భాస్కర్ (గద్వాల), రంగనాథరాయ్ (వనపర్తి), ప్రభాకర్ (నారాయణపేట), చక్రపాణి (హైదరాబాద్), నరసింహస్వామి (మహబూబ్‌నగర్), పాండ్యా (రంగారెడ్డి), బాలస్వామి (మెదక్), కామేశ్ (మేడ్చల్ మల్కాజిగిరి), ప్రతిమా షోమ్ (యాదాద్రి భువనగిరి), రవి (సూర్యాపేట)ను నోడల్ అధికారులుగా నియమించారు.