Telangana | హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఆలయ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీలో వినియోగించాలని స్పష్టం చేసింది. నెయ్యి సేకరించేందుకు ప్రైవేటు డెయిరీలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారుల (ఈవో)కు ఉత్తర్వులు జారీచేశారు.
వీఆర్వోలుగా 9,654 మంది సంసిద్ధత
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో వీఆర్వోలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏల్లో 9,654 మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. వీఆర్వో వ్యవస్థ ఏర్పాటులో భాగంగా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి ఇటీవల విల్లింగ్ తీసుకున్నారు. ఈ నెల 28తో గడువు ముగియగా.. 3,534 మంది వీఆర్వోలు, 5,987 మంది వీఆర్ఏలు విల్లింగ్ ఇచ్చినట్టు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి రాష్ట్రంలో వీఆర్వోలు, సర్వేయర్లను కలిపి 11,500 మంది వరకు సిబ్బందిని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే.. విధులు, నియమ నిబంధనలు, సర్వీస్ వివరాల వంటివాటిపై స్పష్టత ఇవ్వకపోవడంతో చాలా మంది విల్లింగ్ ఇవ్వలేదు.