హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ‘మూడు నెలలుగా జీతాలు లేవు….ఇంటి అద్దె కట్టకపోవడంతో ఓనర్స్ ఇళ్లు ఖాళీ చేయమంటున్నారు. పిల్లల స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నది.. స్కూల్ ఫీజులు కట్టకపోవడంతో యాజమాన్యాలు పిల్లలను నిలదీస్తున్నాయి. కండ్లముందే పిల్లలు పస్తులుండటం చూడలేక అప్పులు చేసి, ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఉద్యోగాల్లో చేరితే చివరకు మా కుటుంబాలకు దిక్కు లేకుండా పోయి ంది’ అంటూ కన్నీరు పెడుతున్నారు టిమ్స్ కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) లో ప్రస్తుతం 180 మంది సేవలందిస్తున్నారు. జీతాలు ఇవ్వాలని మంత్రి రాజనర్సింహకు మొరపెట్టుకున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు రాలేదన్నారు.