వరి సాగుపై ఆంక్షలు లేవు.. హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
Highcourt | వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు.

యాసంగి: వరి విత్తనాల అమ్మకాలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధమైన నిషేధాన్ని విధించలేదని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. యాసంగిలో వరి సాగు చేయవద్దనే నిర్ణయం ఏమీ తీసుకోలేదని తెలియజేశారు. ఆ దిశగా చర్యలు కూడా ఏమీ తీసుకోలేదని, భవిష్యత్‌లో కూడా వరి సాగుపై నిషేధం లేదా వరి విత్తనాల అమ్మకాలపై ఆంక్షలు లేదా నిషేధం విధించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట మండలం ఇమాంబాద్‌కు చెందిన రైతు బాతుల నారాయణ తదితరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్‌కుమార్ మంగళవారం నాడు విచారణ చేపట్టారు. వరి విత్తనాలు అమ్మరాదని, దీని విషయంలో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వరి విత్తనాలను విక్రయించరాదని జిల్లా కలెక్టర్ వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.
వాదనలు విన్న హైకోర్టు ఇలాంటి చర్యలు వద్దని కలెక్టర్‌కు మౌఖికంగా చెప్పింది. నిషేధిత జాబితాలో వరి లేనప్పుడు కలెక్టర్ వ్యాఖ్యలు సరికాదంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా వరి విత్తనాలు అమ్మే షాపుల్ని తెరవనీయబోమని చెప్పడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది.
ఈ క్రమంలో తిరిగి కల్పించుకున్న ఏజీ.. వరి సాగు/వరి విత్తనాలపై నిషేధాన్ని విధించలేదని, ఈ విషయంలో కలెక్టర్‌కు తన వాదన చెప్పుకునే ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. వరి విత్తనాల అమ్మకాలు, కొనుగోలుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ వ్యాఖ్యలు కోర్టుధిక్కారం కిందకు వస్తుందో లేదో పరిశీలన నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

