శనివారం 30 మే 2020
Telangana - Mar 28, 2020 , 12:35:00

రెడ్‌ జోన్‌లు ఎక్కడా లేవు.. వదంతులు నమ్మొద్దు

రెడ్‌ జోన్‌లు ఎక్కడా లేవు.. వదంతులు నమ్మొద్దు

హైదరాబాద్‌ : నగరంలో ఎక్కడా రెడ్‌ జోన్‌లు లేవు అని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న వార్తలు అవాస్తవమని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. అయితే కొందరు దఫదఫాలుగా కుటుంబ సభ్యులతో బయటకు వస్తున్నారు. అలాంటి వారి వల్లనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని సీపీ కోరారు. చందానగర్‌, గచ్చిబౌలి, తుర్కయాంజల్‌, కొత్తపేటను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. 

చందానగర్ రెడ్ జోన్ కాదు సేఫ్ జోనే  : డిప్యూటీ కమిషనర్ 

చందానగర్ రెడ్ జోన్ గా ప్రకటించారు అనే ప్రచారాన్ని చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ నందగిరి, చందానగర్ ఇన్ స్పెక్టర్ రవిందర్ లు ఖండించారు. రెడ్ జోన్ల పై నమస్తే తెలంగాణ వారిని సంప్రదించగ తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. చందానగర్ సర్కిల్ 21 పరిధిలో ఇప్పటివరకు 2 పాజిటీవ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, పలువురు క్వారెంటైన్ లో ఉన్నారని అన్నారు. అనవసర ప్రచారాలను నమ్మి ప్రజలు భయాందోళనకు గురవ్వొద్దని డీసి తెలిపారు. ఐతే ఇళ్లలోంచి మాత్రం ఎవరు బయటకు రావద్ధని, తప్పని పరిస్థితుల్లో రావలసి వస్తే ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు.


logo