హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు పింఛన్ చెల్లింపు ప్రతిపాదన లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. వార్డు సభ్యులకు ప్రతి నెలా రూ.1500 ఇచ్చే ప్రతిపాదన కూడా లేదని తెలిపారు.