కంఠేశ్వర్, ఆగస్టు 23 : హద్దులు దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఉంటుందని, కానీ హద్దులు దాటితే ఎంత పెద్ద వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘించే వారెవరైనా సహించేది లేదని స్పష్టంచేశారు.
సీఎంతోపాటు ఇంకెవరైనా కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలుగా మాట్లాడుతామంటే నడువదని పేర్కొన్నారు. స్వేచ్ఛ ఉన్నదని ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదని అన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవడానికి దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయని తెలిపారు. ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.