హనుమకొండ సబర్బన్, జూన్ 24 : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో గత ప్రభుత్వం తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. విద్యుత్ సరఫరా విషయంలో కీలకంగా ఉన్న సబ్ స్టేషన్లను మానవ రహితం గా మార్చేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) అడుగులు వే స్తున్నది. టాటా పవర్ లిమిటెడ్ మానవ రహిత విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణను ఇప్పటికే ఒడిశాలో అమలు చేస్తుండగా, ఎన్పీడీసీఎల్ అధికారులు వెళ్లి పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నారు. పైలట్ ప్రాజెక్టుగా జనగామ జిల్లాలోని నిడిగొండ, చిన్న పెండ్యాల సబ్స్టేషన్లలో అమలు చేయనున్నారు.
జూలై 5 వరకు వీటిని మానవ రహిత సబ్ స్టేషన్లుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుండగా, పనులను స్కోప్, స్కై్నడర్ సంస్థలకు అప్పగించారు. కొత్తగా తీసుకొస్తున్న రియల్ టైం మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్(ఆర్టీఎంఏసీ) సిస్టం ద్వారా సబ్స్టేషన్లలో లోడ్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే టాటా కంపెనీ ఢిల్లీ, రాజస్థాన్‌తోపాటు ఒడిశాలో ఇలాంటి సబ్స్టేషన్లను విజయవంతగా నడిపిస్తున్నది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలకు కోతలు తప్పవని అభిప్రాయపడుతున్నారు.