హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్ కారణంగా ప్రస్తుతం తాను సెలవులో ఉన్నట్టు తెలిపారు. కొండాపూర్ కొల్లా లగ్జారియా విల్లాస్‌కు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి చేరుకొని మూకుమ్మడిగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడారు. దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.