హైదరాబాద్, డిసెంబర్ 12 (నమ స్తే తెలంగాణ): జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యా ణ్ ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’ వివాదంపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పందించారు. ఈ నెల 8న హైదరాబాద్‌లో ‘టూ ద హ్యాండ్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట మెహిదీపట్నం టోలిచౌకి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయ్యిం ది. ఈ మేరకు అధికారులు ‘వారాహి’కి TS 13 EX 8384 నంబర్‌ను కేటాయించినట్టు మంత్రి తెలిపారు. వారాహి వాహనానికి రవాణాశాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. వారాహి వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్‌గా నిర్ధారించామని, వాహనాల రంగులకు కోడ్స్ ఉంటాయని.. భారత ఆర్మీ ఉపయోగించే కలర్‌కోడ్ వేర్వేరన్నారు. అన్నిరకాల పరీక్షలు జరిపిన తర్వాతే అనుమతిచ్చామని డీటీసీ పాపారావు స్పష్టంచేశారు.