హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పీఎస్‌లో నమోదైన ఓ కేసులో నిందితురాలిని పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ మీనాకుమారి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆమె అభ్యర్ధనను తోసిపుచ్చింది.
అక్రమ నిర్బంధానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్ కోరినట్టు సీసీటీవీ పుటేజీ భద్రపరచేలా ఆదేశాలు జారీచేసేందుకు నిరాకరించారు.