హనుమకొండ చౌరస్తా, జూన్ 7: ప్రభుత్వ చిహ్నాం నుంచి కాకతీయ తోరణాన్ని తొలగిస్తున్నామని ఎక్కడా చెప్పలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె హనుమకొండలో మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, ఇంకా పరిశీలనలో ఉన్నదని తెలిపారు. క్యాబినెట్లో సీఎం రేవంత్‌రెడ్డి అందరితో చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను రెఫరెండమ్‌గా తీసుకున్నామని, ఆరు స్కీంలను అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌రెడ్డి, శ్రీహరి, నాగరాజు పాల్గొన్నారు.