No confidence: ఆలేరు మున్సిపల్ చైర్మన్‌పై ఎనిమిది మంది కౌన్సిలర్లు జనవరి 8న పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ (జనవరి 27న) భువనగిరి ఆర్డివో అమరేందర్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సభ్యులను సమావేశపర్చగా మొత్తం 12 మంది సభ్యులకుగాను కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.
చట్ట ప్రకారం ఎనిమిది మంది సభ్యుల కోరం ఉండాలి. దాంతో ఆర్డీవో సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండున్నర వరకు కూడా ఒక్క సభ్యుడు కూడా హాజరుకాలేదు. దాంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. మరోసారి అవిశ్వాసం పెట్టడానికి వీల్లేదని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చక్రపాణి, లావణ్య, స్వామి, యాదగిరి, రవి, ప్రసాద్, కళ్యాణ్, జైనుధన్, తదితరులు పాల్గొన్నారు.