కాచిగూడ, డిసెంబర్ 27: 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 29న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, సమావేశాలు జరుగకుండా అడ్డుకోవాలని మండలిల ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన శనివారం హైదరాబాద్ కాచిగూడలో 80 కుల, 36 బీసీ, 28 ఉద్యో గ, న్యాయవాదుల, విద్యార్థి తదితర ప్ర జాసంఘాల ప్రతినిధులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వారు మా ట్లాడారు. అదేరోజున ఆయా సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిని విజయవం తం చేయాలని కోరారు. బీసీలకు రాజ్యాధికారం రాకుండా దేశంలో భారీ కుట్ర జరుగుతుందని,10% వ్యక్తుల వద్ద 90% సంపద కేంద్రీకృతమైందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయకుంటే ‘సర్కార్కో బర్కాస్కరో’ అని పేర్కొన్నారు. బీసీలు గడ్డివాములాంటి వారని, అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటారని హెచ్చరించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధించవచ్చని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చే యాలని పిలుపునిచ్చారు. ప్రాదేశిక ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని, లేకుంటే రాష్ట్ర అగ్నిగుండం గా మారుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మేధా వుల సంఘం అధ్యక్షుడు చిరంజీవులు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వైస్ చైర్మన్ వీజీఆర్, తెలంగా ణ బీసీ సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ నాయకులు అయిలి వెంకన్న, శ్రీనివాస్‌యాదవ్, స్వామి, రామకోటి, నీలం వెంకటేశ్, కోల జనార్దన్, సీ రాజేందర్, అంజి, నందగోపాల్ పాల్గొన్నారు.