హైదరాబాద్, జూన్8 (నమస్తే తెలంగాణ) : గురుకుల విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సూచించారు. భద్రత, నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ పడవద్దని కోరారు. సోమవారం ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు, ప్రిన్సిపాల్స్‌తో మంత్రి అడ్లూరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం ప్రణాళికలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం, విద్యాప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, భద్రత తదితర అంశాలను అత్యంత ప్రాధాన్యంతో చూడాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, కార్యదర్శి (ఎఫ్ఏసీ) శారద, డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాసులు, అసిస్టెంట్ సెక్రటరీ (అకౌంట్స్) చిన్నసాయిలు, ఓఎస్డీ వైజే విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.