హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అదనపు చార్జీలు లేకుండా అద్దె బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం వెల్లడించారు.
బుకింగ్ కోసం 040-23450055, 040-69440000, 9440970000 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు.