హైదరాబాద్, డిసెంబర్22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆదివారం ప్రత్యేకంగా కలిశారు.
సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను ఎంపీ అర్వింద్ వెంట తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు బయటకు విమర్శించుకుంటున్నా ఒకరికొకరు సహకరించుకుంటున్నారని, అందుకు ఇదే ఘటన నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.