నవీపేట, జూలై 18: ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను(Pending wages) తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా సమ్మె చేస్తున్న గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్ కార్మికులు(Lift workers) గురువారం నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. రెండు ఎత్తిపోతల పథకాల్లో పని చేసే 120 మంది ఐదు నెలలుగా వేతనాలు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని గుత్ప, అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్కర్స్ యూనియన్ నాయకుడు గణేశ్ తెలిపారు.
తమ ఆవేదనను కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదన్నారు. రెండు లిఫ్ట్‌ల కాంట్రాక్టర్ కిశోర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. మూడు రోజులుగా సమ్మె చేస్తున్నా పాలకులు స్పందించక పోవడం సరికాదన్నారు. వేతనాలను చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.