సుల్తాన్‌బజార్, ఆగస్టు 7 : నిజాం కళాశాలలోని గర్ల్స్హాస్టల్ను పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థినులకే కేటాయించాలని, అప్పటివరకు తాము ఆందోళన విరమించబోమని విద్యార్థినులు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం కళాశాల యూజీ విద్యార్థినులు కాలేజీ ప్రాంగణంలోని చింతచెట్టు వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసన ఐదురోజులుగా కొనసాగుతున్నది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. హాస్టల్‌ను పీజీవారికి కేటాయిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసమని యూజీ వి ద్యార్థినులు మండిపడ్డారు. 5రోజులుగా నిరసన తెలుపుతున్నా కళాశాల పాలకవర్గం స్పందించకపోవడం దుర్మార్గమని వాపోయారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రామీణ విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించాలనే ఉద్దేశంతో భవన నిర్మాణం చేపడితే 50శాతం చొప్పున కేటాయిస్తామనడం కరెక్ట్ సరికాదన్నారు.
హైదరాబాద్, ఆగస్టు7 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా బీసీలమంతా ఏకమై హక్కులను సాధించుకుందామని అమృత్సర్ వేదికగా బుధవారం జరిగిన జాతీయ మహాసభలో ఆ సంఘం నేతలు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 60శాతం ఉన్న బీసీలను ప్రభుత్వాలు, పార్టీలు విస్మరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో రైతు ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం చేపడుదామని, అందుకోసం పార్టీలకతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చారు. మండల కమిషన్ సిఫారసులు అమలు చేయాలని 40ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోలేదని, కులగనణన చేపట్టడడం లేదని విమర్శించారు.