యాదగిరీశుడికి నిత్యోత్సవాలు
స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, తిరువారాధన, నిజాభిషేకం నిర్వహించారు.
యాదాద్రి, సెప్టెంబర్ 30: స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపించారు. శుక్రవారం తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ, తిరువారాధన, నిజాభిషేకం నిర్వహించారు. ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబు చేసి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవాన్ని జరిపించారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధనను వైభవంగా నిర్వహించారు. స్వయంభూ నారసింహుడికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. స్వామివారిని 6,324 మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.10,61,130 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

