నిర్మల్ అర్బన్, నవంబర్ 13 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బుధవారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వాచ్‌మన్‌గా పనిచేసే బందెన్న కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆయన కుమారుడు భరత్‌ను 3 నెలల క్రితం బిల్ కలెక్టర్‌గా నియమించారు. అప్పటి నుంచి సర్వీస్ బుక్‌లో తన పేరును ఎంట్రీ చేయాలని ఇన్చార్జి ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్ షాకీర్ఖాన్కు భరత్ విన్నవించాడు. రెండు నెలలు తి ప్పుకున్నా ఎంట్రీ చేయలేదు. పైగా రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరికి రూ.15 వేలు ఇస్తానని అంగీకరించాడు. ఈ విషయమై భరత్ ఈ నెల 10న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం.. బుధవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో రూ.15 నగదు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వీరి వెంట సీఐలు కృష్ణకుమార్, కిరణ్‌రెడ్డి తదితరులున్నారు.
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ): కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో చార్జీలను సవరించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల నుంచి నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ముందస్తు రిజర్వేషన్‌కు tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.