రైతుల సమస్యలొదిలి ఢిల్లీ యాత్రలా?
‘తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గాలికొదిలి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర లు చేస్తారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట’ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావంపై అత్యవసర క్యాబినెట్ భేటీ, రైతు వేదికల్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తామని నమ్మబలికి, వా టిని అర్ధంతరంగా వాయిదా వేసి వారం తా ఢిల్లీ వెళ్లడాన్ని సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
- సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలది బాధ్యతారాహిత్యం
- క్యాబినెట్ భేటీ ఏది.. రైతుల ముఖాముఖి ఏమాయే?
- రైతుల్ని రెండో పంట వేయొద్దనడం నమ్మకద్రోహమే
- కాంగ్రెస్ సరార్‌పై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గాలికొదిలి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ యాత్ర లు చేస్తారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట’ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎల్ నినో ప్రభావంపై అత్యవసర క్యాబినెట్ భేటీ, రైతు వేదికల్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తామని నమ్మబలికి, వా టిని అర్ధంతరంగా వాయిదా వేసి వారం తా ఢిల్లీ వెళ్లడాన్ని సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
అబద్ధపు హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్.. ఇప్పుడు అబద్ధాలతోనే పాలన సాగిస్తున్నదని ధ్వజమెత్తారు. ఆరుతడి పంటలు వేయండని చెప్పిన నోటితోనే నేడు రెండో పంట అసలే వేయొద్దని రైతులను హె చ్చరించడం కాంగ్రెస్ నమ్మక ద్రోహమేనని వి మర్శించారు. ఎత్తిపోతల మోటర్లను నిలిపివేసి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనా లే తొలి ప్రాధాన్యమని నిరంజన్‌రెడ్డి తేల్చి చెప్పారు. కానీ, జాతీయ పార్టీలకు వారి స్వ ప్రయోజనాలు ముఖ్యమని పార్టీలను నమ్ముకుంటే రాష్ర్టానికి అథోగతేనని గతంలో కేసీఆర్ పదేపదే హెచ్చరించారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

