Niranjan Reddy | ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం రైతుల కాళ్లు మొక్కడానికి సిద్ధపడ్డా : నిరంజన్ రెడ్డి
ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, భూమి ఇవ్వాలని రైతుల కాళ్లు మొక్కుతా అని విజ్ఞప్తి చేసినట్లు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, భూమి ఇవ్వాలని రైతుల కాళ్లు మొక్కుతా అని విజ్ఞప్తి చేసినట్లు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాలమూరు – రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కడినే 73 సార్లు వెళ్లి రైతులను కలిశానని గుర్తు చేశారు. ప్రతిసారి వెళ్లి రైతులతో ఓపికతో కూర్చొని రైతులకు నచ్చజెప్పాను. ఒక్కో సందర్భంలో రాత్రి 10 అయ్యేది అన్నారు.
వలస పోయిన పాలమూరుకు నీళ్లు వస్తే బాగు పడుద్దని, రైతులకు విజ్ఞప్తి చేసి కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించానని పేర్కొన్నారు.
అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములు ఇచ్చారు. అది వదిలేసి నేను భూములు తీసుకుంటా రైతులు ఏంత? వాళ్లు కూర్చొని ఏం చేస్తారు అని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అంటే కుదరదు. ఆయన తాత వచ్చినా రైతుల భూములు లాక్కొని ప్రాజెక్ట్ కట్టలేరన్నారు. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికే లాగులు తడిచేటట్లు చేశారు అక్కడి రైతులు. అలాగే రైతుల తరఫున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు.
ఏదుల రిజర్వాయర్ కోసం భూమి ఇవ్వాలని రైతులకు కాళ్లు మొక్కుతా అని విజ్ఞప్తి చేశాను
పాలమూరు – రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం నేనొక్కడినే 73 సార్లు వెళ్ళి రైతులను కలిశాను
ప్రతిసారి వెళ్ళి ఓపికతో కూర్చొని అంశాన్ని బోధించి రైతులకు నచ్చజెప్పాను.. ఒక్కో సందర్భంలో… https://t.co/3pySML0mG9 pic.twitter.com/bu8RXIBB5F
— Telugu Scribe (@TeluguScribe) April 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

