హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం సమాజానికి తీరనిలోటు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కమ్యూనిస్టు యోధునిగా ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ఆయన మరణించినా, వారి ఆదర్శాలు జీవిస్తాయని తెలిపారు. ప్రజా పోరాటాల్లో వారు రెడ్ స్టార్ వెలిగారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.