వనపర్తి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కాంగ్రెస్ నిలిచిందని, అందుకే ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని పేర్కొన్నారు.
సాధ్యం కాని గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్, ఇచ్చిన హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని గుర్తుచేశారు. మళ్లీ ప్రగతి పరుగులు పెట్టాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. మసీదుల వద్ద ముస్లింలను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు.