NIOS | కాచిగూడ, మార్చి 19: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(NIOS) సెకండరీ, సీనియర్ సెకండరీ థియరీ పరీక్షలు ఏప్రిల్ 9వ తేదీ నుండి మే 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రాంతీయ సంచాలకులు పరంప్రీత్ సింగ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్, హాల్ టికెట్లు www.nios.ac.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు విద్యార్థులు 040-24752859, 040-24750712 లో సంప్రదించాలని ఆయన తెలిపారు.