హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50 కిలోల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా 2014లో సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కవితను కోరారని, దాంతో సీఎం కేసీఆర్ రూ.50 లక్షలు మంజూరు చేశారని నిఖత్ గుర్తు చేసుకున్నది. దాంతోపాటు అదనంగా రూ.2కోట్లు మంజూరు చేయడంతో పాటు నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని కవిత పేర్కొన్నారు.