విద్యుద్ధీప కాంతుల్లో ‘టీ హబ్’ జిగేల్ మంటోంది. రాత్రిపూట రంగురంగు లైట్ల వెలుగుల్లో మెరిసిపోతున్నది. ఈ టీ హబ్ 2 భవన సముదాయాల నైట్ వ్యూ ఫొటోలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రి కేటీఆర్ ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దీన్ని ఈ నెల 28న (మంగళవారం) సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాయిదుర్గం నాలెడ్జ్ సిటీ ఎస్ఈజెడ్లో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సంలో దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. టీ హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.